: విజయ్ మాల్యా పాస్ పోర్టును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసిన ప్రభుత్వం


ఒకప్పుడు లిక్కర్ కింగ్ గా వెలుగొంది ఖజానాకు గండికొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాను ప్రభుత్వం ఇరుకునపెట్టింది. విజయ్ మాల్యా పాస్ పోర్టును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా ఆయన ఇండియాకు రాక తప్పని పరిస్థితులు నెలకొల్పడం ద్వారా ఆయనను దేశానికి రప్పించి, ముక్కుపిండి బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈడీ అందించిన నివేదికతో కదిలిన కేంద్ర ప్రభుత్వం ఆయన పాస్ పోర్టును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈడీ, న్యాయస్థానాల ఆదేశాలు బుట్టదాఖలు చేసిన మాల్యా ఎలాంటి ఎత్తుగడ వేయనున్నాడో చూడాలి.

  • Loading...

More Telugu News