: ఎవరి కన్న బిడ్డో ఈ మృత్యుంజయురాలు... భూకంప శిథిలాల నుంచి బయటపడ్డ నెలల పాప


గత రాత్రి జపాన్ లో సంభవించిన భారీ భూకంపంలో కుప్పకూలిన ఓ ఇంటి శిథిలాల నుంచి ఎనిమిది నెలల చిన్నారి సురక్షితంగా బయటపడింది. భూకంపంతో కూలిన భవనాల శిథిలాలు తొలగిస్తున్న వేళ, పాప ఏడుపు విన్న భద్రతా దళాలు వెంటనే స్పందించి బయటకు తీశాయి. స్వల్ప గాయాలతో ఉన్న పాపను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అంతటి ప్రమాడంలోను ప్రాణాలతో బయటపడ్డ ఈ మృత్యుంజయురాలి తల్లిదండ్రుల ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ భూకంపానికి ఇప్పటివరకూ 9 మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన భూకంపం ధాటికి 800 మందికి పైగా గాయపడగా, కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది.

  • Loading...

More Telugu News