: ఎనిమిదేళ్ల వయసులో తప్పిపోయి 29 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను చేరిన మహిళ


జ్యోత్స్నా ధావ్లే కథ ఒక ఆసక్తికరమైన కథ. 1995లో మహారాష్ట్రలోని దత్తానగర్ లోని ఇంటి నుంచి బయటలకు వచ్చిన జ్యోత్స్న దగ్గరలోని రైల్వే స్టేషన్ కి వెళ్లింది. అక్కడ యథాలాపంగా ఓ రైలెక్కి ముంబై వెళ్లిపోయింది. ఐదు రోజులు రైల్వే స్టేషన్ లోనే ఉంది. అక్కడి నుంచి మరో రైలెక్కి హైదరాబాదు చేరుకుంది. ట్రైన్ లో జ్యోత్స్నను హోటల్ నడిపే మహిళ చేరదీసి, హోటల్ లో పనికి కుదుర్చుకుంది. కొన్నాళ్లకు ఆ కుటుంబం కేరళ వెళ్లిపోయింది. ఆ కుటుంబం ఆమెను హింసించడంతో ఆమె అక్కడి నుంచి పారిపోయి బెంగళూరు చేరుకుంది. రైల్వే స్టేషన్లో తిరుగుతున్న జ్యోత్స్నను బెంగళూరు ఛైల్డ్ లైన్ పోలీసులు చేరదీసి ఓ వసతి గృహంలో చేర్చారు. అక్కడే జ్యోత్స్న చదువు పూర్తి చేసింది. ఈ క్రమంలో స్నేహితుడు శివశక్తిని వివాహం చేసుకుని, సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అయినప్పటికీ ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేదు. దీంతో గత మార్చి 16న తన స్వస్థలమైన చంద్రాపూర్ పోలీసుల హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి, తన తండ్రి పేరు నాందియో అని, ఆయన ఆటోడ్రైవర్ గా పని చేస్తాడని చెప్పి...తన కుటుంబాన్ని కలిసేందుకు సాయం చెయ్యాలని కోరింది. దీంతో రికార్డులు తిరగేసిన పోలీసులు ఆటోడ్రైవర్ల సాయంతో నాందియోను కనుక్కొని, ఆయన కుమార్తె బతికే ఉందని, వారిని వెతుకుతోందని చెప్పారు. 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమార్తె మళ్లీ తమను వెతుకుతోందని తెలిసిన జ్యోత్స్నా ధావ్లే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. తాజాగా తన కన్నవారిని ఆమె కలుసుకుంది. ఆ ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది!

  • Loading...

More Telugu News