: ఒబామా సర్కారుపై కేసు పెట్టిన మైక్రోసాఫ్ట్
ప్రజలకు తెలియకుండా వారి ఈ-మెయిల్స్, ఆన్ లైన్ ఫైళ్లను పరిశీలించేందుకు వివిధ విచారణా సంస్థలకు అధికారమిస్తూ బరాక్ ఒబామా నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం చట్టం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వంపై ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కేసు పెట్టింది. ఇది 1986 నాటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ప్రైవసీ చట్ట ఉల్లంఘనేనని, ఎవరి ఫైల్ ను చూడాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని మైక్రోసాఫ్ట్ వాదిస్తుండగా, పాతకాలం నాటి చట్టాలు ఇప్పుడు పనికిరావని, అవసరాన్ని బట్టి తాము అనుమానితుల ఈ-మెయిల్స్, ఆర్థిక రికార్డులు పరిశీలించాల్సి వస్తుందని, వాటిని సులువుగా చేరుకునే వీలుండాల్సిందేనని యూఎస్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం వాదిస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ సియాటెల్ ఫెడరల్ కోర్టులో ఈ కేసు దాఖలు చేయగా, తాము క్రూరమైన నేరస్తులు, ఉగ్రవాదులపై మాత్రమే నిఘా వేస్తామని అధికారులు తెలిపారు.