: ఇండియాను ఓ దుష్ట గ్రహం పట్టుకుంది: లాలూ


ఇండియాను ఇప్పుడో దుష్ట గ్రహం పట్టుకుందని, దాని పేరు నరేంద్ర మోదీ అని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సభలో ఆయన మాట్లాడుతూ, మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నీటి కష్టాలు పెరిగాయని, తీవ్ర కరవు, వర్షాభావం దేశాన్ని పట్టి పీడించడం ప్రారంభమైందని అన్నారు. దేశంలోని గురువులు, బాబాల ఆస్తులపై విచారణ జరిపించాలని లాలూ డిమాండ్ చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ పైనా లాలూ విమర్శలు గుప్పించారు. మతం పేరు చెప్పి గురువులు, బాబాలూ ప్రజలను వెర్రోళ్లను చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News