: మూడు నెలల్లో 8.5 లక్షల కుంటలు: అధికారులకు చంద్రబాబు ఆదేశం
వచ్చే మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 8.5 లక్షల నీటి కుంటలను తవ్వి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఈ మధ్యాహ్నం జల వనరులు, భూగర్భ జలాలు, వైద్యశాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సాధ్యమైనంత త్వరలో కుంటల తవ్వకం పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ వేసవిలో నీటికి కొరత రాకుండా చూడాలని, రానున్న రోజుల్లో వేడి తీవ్రత పెరగనున్నందున వడదెబ్బ కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతకన్నా ముందు ప్రజల్లోకి వెళ్లే అధికారులు తగు జాగ్రత్తలతో ఉండాలని సలహా ఇచ్చారు.