: భూమా అభ్యంతర వ్యాఖ్యలకు నిరసనగా దళితుల రాస్తారోకో


నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ పట్ల అవహేళనగా మాట్లాడాడని ఆరోపిస్తూ, కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కర్నూలు - గుంటూరు రహదారిపై పాములపాడు వద్ద రోడ్లను దిగ్బంధించారు. నిన్న భూమాను కలిసిన కొందరు దళితులు, తమకు అంబేద్కర్ భవన్ ను కట్టించాలని కోరగా, ఆయన మండిపడ్డారట. తినడానికి తిండిలేని వారికి అంబేద్కర్ భవన్ అంత అవసరమా? అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని ఆరోపిస్తూ, ఈ ఉదయం నుంచి పలువురు ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News