: 34 ఏళ్లలో తొలిసారి... బుకింగ్స్ లేక ఆగిన ప్యాలెస్ ఆన్ వీల్స్!


ప్యాలెస్ ఆన్ వీల్స్... రాజ దర్బార్ ను తలపించే రైలు పెట్టెలు, అద్భుత ఆతిథ్యంతో 7 రాత్రులు, 8 పగళ్ల పాటు జైపూర్, ఉదయ్ పూర్, జైసల్మేర్, జోధ్ పూర్ ప్రాంతాల్లో పర్యటిస్తూ, టూరిస్టులకు స్వర్గాన్ని చూపించే రైలు. 1982లో ఈ రైలు సేవలు ప్రారంభం కాగా, ఒక ట్రిప్ లో కేవలం 104 మందికి మాత్రమే దీనిలో చోటు ఉంటుంది. ఈ రైలులో ప్రయాణించాలంటే రూ. 2.50 లక్షలు చెల్లించాల్సి వుంటుంది. 2008లో ప్రపంచాన్ని ఆర్థికమాంద్యం చుట్టుముట్టిన వేళ సైతం దీనికి బుకింగ్స్ తగ్గలేదు. అయితే, ఈ రైలు తాజా ట్రిప్ కు ఎలాంటి బుకింగ్స్ లేకపోవడంతో ఏప్రిల్ పర్యటన రద్దయింది. ప్యాలెస్ ఆన్ వీల్స్ చరిత్రలో టూరిస్టులు రైలెక్కేందుకు రాకపోవడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. కనీసం 25 మంది ప్రయాణికులుంటే రైలును నడిపే వారమని ప్యాలెస్ ఆన్ వీల్స్ జనరల్ మేనేజర్ ప్రదీప్ బోహ్రా వెల్లడించారు. ఇకపై తమ వ్యూహం మార్చాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News