: ఏదో ఒకరోజు మీ సరదా తీరుస్తా: రష్యా అధ్యక్షుడు పుతిన్
మొదటి భార్య లుద్మిలా నుంచి మూడేళ్ల క్రితం విడిపోయిన తరువాత, జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అలినా కాబేవాతో పుతిన్ సంబంధం కొనసాగిస్తున్నాడని వరుస కథనాలు వెలువడుతున్న వేళ, ఓ లైవ్ కార్యక్రమంలో రెండో పెళ్లి చేసుకున్నారా? అన్న ప్రశ్నకు తొలుత తడబడిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆపై తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తన ప్రైవేటు జీవితం కన్నా, రష్యా అధ్యక్షుడిగా పనితీరునే ప్రజలు గమనిస్తున్నారని, అయితే, ఏదో ఒకరోజు మీ ప్రశ్నకు సమాధానం చెప్పి మీ సరదా తీరుస్తానని అన్నారు. 2013లో విడాకుల అనంతరం ఒలంపిక్ జిమ్నాస్టిక్ ప్లేయర్ కాబేవాతో ఆయన రొమాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను వివాహం చేసుకున్నారా? లేక సహజీవనం చేస్తున్నారా? అన్న విషయమై పుతిన్ సైతం ఎన్నడూ నోరు విప్పలేదు.