: మళ్లీ మాట మార్చిన పాక్!... భారత్ తో చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటన
దాయాది దేశం పాకిస్థాన్ నాలుకకు నరాలే లేనట్టుంది. ఓ రోజు ఓ మాట అంటే.. ఆ మరునాడే సదరు మాటకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆ దేశానికి కొత్తేమీ కాకపోయినా, ఇటీవలి కాలంలో ఈ తరహా వ్యవహార సరళితో ఆ దేశం ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తోంది. భారత్ తో ద్వైపాక్షిక చర్చలు నిలిచిపోయినట్లేనని భారత్ లో ఆ దేశ రాయబారి అబ్దుల్ బాసిత్ గత వారంలో ప్రకటించారు. అందుకు పూర్తి భిన్నంగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా నిన్న ఇస్లామాబాదులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన జకారియా, ఈ విషయంలో ద్వారాలు మూసుకుపోలేదని ప్రకటించారు.