: టీడీపీ ఆదరించకుంటే... రేషన్ డీలర్ గానే ఉండేవాడివి: ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డి సెటైర్లు


టీడీపీకి హ్యాండిచ్చి ‘కారు’ ఎక్కిన ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న వరంగల్ లో జరిగిన ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... ఎర్రబెల్లి ఇలాకాలోనే ఆయనపై సెటైర్లు సంధించారు. రాజకీయంగా భిక్ష పెట్టి, అన్ని పదవులను కట్టబెట్టిన టీడీపీకి ఎర్రబెల్లి ద్రోహం చేస్తూ టీఆర్ఎస్ లో చేరాడని ఆయన ఆరోపించారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఎర్రబెల్లి ప్రస్తుతం టీఆర్ఎస్ లో చెల్లని పైసగా మారాడని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలో ఉండగా ఎర్రబెల్లికి పదవులు ఇవ్వకుండా ఉండి ఉంటే.... ఇప్పటికీ ఎర్రబెల్లి రేషన్ డీలర్ గానే ఉండేవాడని ఎద్దేవా చేశారు. టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితిలో ఉన్నాడని ఆరోపించారు.

  • Loading...

More Telugu News