: భద్రాద్రికి కేసీఆర్... రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న టీఎస్ సీఎం


ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. నిన్న రాత్రికే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం చేరుకున్నారు. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయం ముందు ప్రత్యక్షమైన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నేటి ఉదయం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి వెళ్లనున్నారు. నిన్న సాయంత్రానికే మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)కు చేరిన కేసీఆర్... అక్కడి నుంచే హెలికాప్టర్ లో భద్రాద్రికి వెళ్లనున్నారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్... స్వామివారి దర్శనానంతరం తిరిగి తన ఫామ్ హౌస్ కు చేరుకుంటారు.

  • Loading...

More Telugu News