: రాణించిన రహానే, డుప్లెసిస్, పీటర్సన్, ధోనీ...గుజరాత్ లక్ష్యం 164 పరుగులు
రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ బ్యాట్స్ మన్ రహనే, డుప్లెసిస్, పీటర్సన్, ధోనీ రాణించారు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు రహానే (21), డుప్లెసిస్ (69) రాణించారు. రహానే అవుటవ్వడంతో వచ్చిన కెవిన్ పీటర్సన్ (39) ఆకట్టుకున్నాడు. స్మిత్ (5) విఫలం కావడంతో వచ్చి ధోనీ (22) ఉన్న కాసేపు మెరుపులు మెరిపించాడు. మార్స్ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పూణే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్ లయన్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా, ప్రవీణ్ తాంబే చెరో రెండు వికెట్లతో రాణించగా, బ్రావో ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. 164 పరుగుల విజయ లక్ష్యంతో గుజరాత్ బ్యాటింగ్ ప్రారంభించింది.