: మా పెదనాన్న ఫ్యాన్స్ కు, బాబాయి ఫ్యాన్స్ కు ధన్యవాదాలు: వరుణ్ తేజ్
నాకు తెలిసి బాగా కష్టపడిన వారిలో సాయిధరం తేజ్ మొదటి వ్యక్తి అని వరుణ్ తేజ్ తెలిపాడు. 'సుప్రీం' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తామిద్దరం చిన్నప్పటినుంచి జిమ్ లో పరిగెడుతూ ఉండేవాళ్లమని అన్నాడు. దాని వల్లే తాను కొంచెం బరువు తగ్గానని వరుణ్ తేజ్ గుర్తు చేసుకున్నాడు. తమను ప్రోత్సహిస్తున్న తన పెదనాన్న, బాబాయ్ అభిమానులందరికీ ధన్యవాదాలని తెలిపాడు. సాయిధరమ్ తేజ్ ఇలాగే మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించాడు. రాశీ ఖన్నా చాలా అందంగా ఉందని చెప్పాడు.