: 'అందం హిందోళం' నా ఫేవరేట్ పాట :రాశీ ఖన్నా


సాయి ధరమ్ తేజ్ డాన్సులు చించేశాడని రాశీ ఖన్నా తెలిపింది. 'సుప్రీం' ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడిలో ఎన్నో కోణాలున్నాయని, వాటన్నింటినీ సినిమాలో చూపించేందుకు ప్రయత్నించాడని చెప్పింది. తనను బెల్లం శ్రీదేవిగా చాలా అందంగా చూపించారని ఆమె పేర్కొంది. సంగీత దర్శకుడు అన్ని పాటలకు మంచి సంగీతం ఇచ్చినా, వాటిల్లో తన ఫేవరేట్ పాట 'అందం హిందోళం' అని చెప్పింది. సాయిధరమ్ తేజ్ తో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పిన రాశీ ఖన్నా, అతనితో మళ్లీ పనిచేయాలని కోరుకుంది.

  • Loading...

More Telugu News