: తమిళ న్యూ ఇయర్ వేడుకలు సుహాసిని ఇంట్లో జరుపుకున్నాం: నటి జయసుధ
తమిళ న్యూఇయర్ వేడుకలను నటి సుహాసిని ఇంట్లో జరుపుకున్నామని మరో నటి జయసుధ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ట్వట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం సుహాసిని ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నామన్నారు. ఈ విందుకు నటీమణులు ఖుష్బూ, శోభన, రాధిక, రేవతి, పూర్ణిమ, నదియ తదితరులు పాల్గొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వారు దిగిన ఒక గ్రూప్ ఫొటోను జయసుధ పోస్ట్ చేశారు.