: 'సుప్రీం' సినిమా ఆడియో వేడుక ప్రారంభం
సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సుప్రీం ఆడియో వేడుక ప్రారంభమైంది. హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఈ వేడుక జరుగుతోంది. మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ కావడంతో మెగా ప్యామిలీ ఈ వేడుకకు హాజరైంది. సాయిధరమ్ తేజ్ తో పాటు రాశి ఖన్నా, రవి కిషన్, జయప్రకాశ్ రెడ్డి, చిరంజీవి తల్లి అంజనాదేవి, దిల్ రాజుతో పాటు పలువురు దర్శకులు వేడుకకు హాజరయ్యారు. వారితో పాటు యువ కథానాయకులు నాని, వరుణ్ తేజ్ తదితరులు హాజరుకావడంతో అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.