: సికింద్రాబాద్ లో హోంగార్డు ఆత్మహత్య
కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి బాలరాజు అనే హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనంతా సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఆధారాల ప్రకారం, ఆలయం వద్దకు ఎరుపు రంగు చొక్కా ధరించి వచ్చిన బాలరాజు కొంచెం సేపు అక్కడే తచ్చాడాడు. ఆ తర్వాత ఒక మహిళ అతడిని కలిసి వెళ్లింది. అనంతరం అక్కడ నుంచి వెళ్లిన బాలరాజు కూల్ డ్రింక్ తెచ్చుకున్నాడు. అంతకుముందే తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందును ఆ కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగాడు. అక్కడే రేకులతో నిర్మించి ఉన్న ఒక డబ్బాలోకి వెళ్లిన బాలరాజు అందులోనే చనిపోయాడు. ఇదంతా సీసీీటీవీలో రికార్డు అయింది. కాగా, గతంలో హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలరాజు పనిచేశాడు.