: ఆ గ్రూప్‌లో భార‌త్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్న పాక్, చైనా!


భార‌త్‌పై పాకిస్థాన్ ఎప్ప‌టిక‌ప్పుడు తన వ‌క్రబుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. భార‌త్‌కు ప్ర‌తికూలంగా వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంది. తాజాగా తన వైఖ‌రికి మ‌రోసారి వెళ్లగక్కింది. ప్రపంచ వ్యాప్తంగా న్యూక్లియర్ ఆయుధాల పెరుగుదలను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్ప‌డిన ‘న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్‌’లో భార‌త్‌ను చేర‌నివ్వ‌కుండా చైనా అడ్డుకోవాల‌ని పాకిస్థాన్ అంటోంది. భార‌త్‌ ‘న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్‌’లో చేరేందుకు అమెరికా భారత్ ప‌ట్ల సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నప్ప‌టికీ.. చైనా మాత్రం అడ్డకుంటుందని అంతర్జాతీయ న్యూక్లియర్ ఆర్డర్‌పై జ‌రుగుతోన్న స‌మావేశంలో పాక్ మాజీ దౌత్యవేత్త జమీర్ అక్రమ్ పేర్కొన్నారు. చైనాతో పాక్‌కు ఉన్న పరస్పర న్యూక్లియర్ సహకార సంబంధాల వ‌ల్ల భార‌త్ స‌ద‌రు గ్రూప్‌లో చేరేందుకు చైనా ఒప్పుకోద‌ని అన్నారు. అంతేకాదు, ఈ గ్రూప్‌లో భారత్ చేరే అవకాశాలు క‌న‌ప‌డ‌డం లేదని వ్యాఖ్యానించాడు. ప్ర‌స్తుతం ‘న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్‌’లో 48 దేశాలకు స‌భ్య‌త్వం ఉంది.

  • Loading...

More Telugu News