: ఆరోగ్యానికి మేలు చేసే ‘ఐస్ క్యూబ్ ఫేషియల్’!


వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఉన్నా లేక పనులపై బయటకు వెళ్లినా ఎండ తీవ్రత ప్రజలను బాధిస్తూనే ఉంది. దీనిని నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలు ఎవరి తాహతకు తగ్గట్లు వారు సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. చల్లని మంచినీరు, మజ్జిగ, కొబ్బరిబోండాలు, జ్యూస్ లు, షర్బత్ లు, కూల్ డ్రింక్స్, పుచ్చకాయలు ... ఇలా ఎవరికి అందుబాటులో ఉన్నవి వారు తీసుకుంటున్నారు. అదే సమయంలో, ఎండ వేడిమి నుంచి చర్మం పాడవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఐస్ క్యూబ్ ఫేషియల్’ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతిలో కేవలం వేడిమి నుంచి చర్మానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే కాకుండా ఆరోగ్య పరంగా మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఒకటి లేదా రెండు ఐస్ క్యూబ్ లను ముఖంపై ఉంచుకోవడం ద్వారా వేడిని బయటకు పంపవచ్చు. ఐస్ క్యూబ్ ఫేసియల్ ద్వారా చేకూరే ఇతర ప్రయోజనాలు... * ముఖ్యంగా తెరచుకుని ఉన్న స్వేద రంధ్రాలు బిగుతుగా ఉండేలా చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ తయారవకుండా తగ్గిస్తుంది. తద్వారా చర్మం సుతి మెత్తగా తయారవుతుంది. * ముఖంపై వచ్చే మొటిమలను నివారిస్తుంది. కొత్తగా వస్తున్న లేదా అంతకుముందు నుంచే మొటిమలపై ఐస్ క్యూబ్ తో చిన్నగా రుద్దడం ద్వారా వాటికి చెక్ పెట్టవచ్చు. * చర్మ కాంతికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. దోసకాయ ముక్కలు, తేనే, నిమ్మరసంను ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి గడ్డకట్టేలా చేయాలి. ఆ తర్వాత ఒక ఐస్ క్యూబ్ ను తీసుకుని చర్మంపై రుద్దితే మంచి ఫలితాలు వస్తాయి. చర్మం నిగనిగలాడుతుంది. * కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు, ఉబ్బినట్టుగా ఉంటే కనుక ఐస్ క్యూబ్ థెరపీ ద్వారా వాటికి పరిష్కారం కనుగొనవచ్చు. మరగించిన గ్రీన్ టీ, వడబోసిన నీటిని ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి గడ్డకట్టేలా చేయాలి. ఆ తర్వాత కళ్లపై ఐస్ క్యూబ్ లను నిర్ణీత సమయం ఉంచటం ద్వారా నల్లటి వలయాలు, ఉబ్బినట్టుగా ఉండటం వంటి సమస్యలను క్రమంగా దూరం చేసుకోవచ్చు. * ఐస్ క్యూబ్ లతో మసాజ్ ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరచుకోవచ్చు. తద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఐస్ క్యూబ్ ట్రేలో మసాజ్ ఆయిల్స్ ను చేర్చి కూడా ఐస్ క్యూబ్ లను ఉపయోగించుకోవచ్చు. తద్వారా స్పా కు వెళ్లిన అనుభూతిని పొందవచ్చు.

  • Loading...

More Telugu News