: విదేశాల్లో భారీ మొత్తాన్ని దాచుకున్న అమెరికన్ కంపెనీలివే!


పనామా పేపర్స్ విడుదలైన తర్వాత ఆక్స్ ఫామ్ తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అమెరికాలో పెద్ద కంపెనీలుగా వెలుగొందుతున్న 50 సంస్థలు విదేశాల్లో పెట్టుబడుల పేరిట భారీ ఎత్తున డబ్బు దాచుకున్నట్టు బయటపడింది. పన్ను పోటు తక్కువగా ఉండే దేశాల్లో యాపిల్, వాల్ మార్ట్, ఐబీఎం, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఫైజర్, గోల్డ్ మాన్ సాచ్స్, డో కెమికల్స్, చెవ్రాన్ వంటి సంస్థలు భారీ మొత్తాన్ని దాచుకున్నాయి. యాపిల్, వాల్ మార్ట్, జనరల్ ఎలక్ట్రిక్ వంటి సంస్థలు సుమారు ట్రిటియన్ డాలర్ల డబ్బును దాచినట్టు తెలుస్తోంది. ఆ సంస్థలకు బిలియన్ డాలర్ల రూపంలో పన్ను మినహాయింపు లభిస్తోందని ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. ఆక్స్ ఫామ్ లెక్కల ప్రకారం యాపిల్ సంస్థ 181 బిలియన్ డాలర్ల మొత్తాన్ని, జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ 119 బిలియన్ డాలర్ల మొత్తాన్ని, మైక్రోసాఫ్ట్ సంస్థ 108 బిలియన్ డాలర్ల మొత్తాన్ని విదేశాలకు దారిమళ్లించినట్టు తెలిపింది. ఈ మొత్తం స్పెయిన్, మెక్సికో, ఆస్ట్రేలియా దేశాల జీడీపీ కంటే ఎక్కువ మొత్తమని ఆక్స్ ఫామ్ నివేదిక అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News