: విజయ్ సినిమా రిలీజ్ సందర్భంగా కొత్త పుంతలు తొక్కిన తమిళ సినీ అభిమానం!


తమిళనాడులో సినీ అభిమానం కొత్త పుంతలు తొక్కింది. తమ హీరోల కటౌట్లకు రెగ్యులర్ గా క్షీరాభిషేకాలు చేసే అభిమానులు ఈసారి కూల్ డ్రింక్ లతో చేశారు. విజయ్ హీరోగా నటించిన ‘తేరి’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా విజయ్ కటౌట్లకు ఫాంటా, కోకో కోలా కూల్ డ్రింక్ లతో అభిషేకం చేశారు. ఒక అభిమాని పెరుగు ప్యాకెట్ తో, మరో అభిమాని బీరు బాటిల్ తో విజయ్ కటౌట్లకు అభిషేకం చేయాలని ప్రయత్నించినప్పటికీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రదర్శించిన మొదటి ఆట టికెట్లు బ్లాకులో రూ.700 వరకు అమ్ముడు పోయాయని సమాచారం. సినిమాకు వచ్చిన వాళ్లందరికీ ఉచితంగా స్టీలు గ్లాసు, ఒక లడ్డూ, చాక్లెట్ పంచి పెట్టారు. కాగా, తమిళనాడులో హీరోల కటౌట్లకు క్షీరాభిషేకాలు చేయనివ్వకుండా చూడాలంటూ ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) ఒకటి కోర్టులో దాఖలైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News