: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు


ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. పొన్నూరులోని ఐలాండ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నరేంద్ర పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుంచి వస్తున్న ఆయన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సమసిపోయింది.

  • Loading...

More Telugu News