: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాంబు ఉందంటూ బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఓ ఆగంతుకుడు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి మరి కొద్దిసేపట్లో బాంబు పేలుతుందంటూ బెదిరించాడు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు రైల్వేస్టేషన్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు సమాచారంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.