: పాగా వేశాం... ఇండియాపై ఉగ్రదాడి మాకెంతో ఈజీ: ఐఎస్ఐఎస్


ఇండియాలో తాము ఇప్పటికే పాగా వేశామని, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల సహకారంతో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఎస్ఐఎస్ సంచలన ప్రకటన చేసింది. ఐఎస్ ఆన్ లైన్ పత్రిక 'దబీక్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ అబూ ఇబ్రహీం అల్-హనీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోని బెంగాల్ ప్రాంతం తమకు వ్యూహాత్మకంగా అనుకూలమైనదని హనీఫ్ చెబుతున్నాడు. విలాయత్ ఖురాసన్ (ఆఫ్గనిస్థాన్, పాక్ కేంద్రాలుగా పనిచేస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ విభాగం) సాయం తీసుకునే భారత ముజాహిద్దీన్ లు దాడులకు దిగుతారని చెప్పాడు. కాగా, బంగ్లాదేశ్ కేంద్రంగా జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలు ఇండియాకు విస్తరించాయని గత నెలలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్, సిరియాల్లో పట్టు కోల్పోతున్న ఉగ్రవాదులు ఇతర దేశాలపై దృష్టిని సారించారని, వారిని అడ్డుకోవడం తొలి ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News