: లిటిల్ రణ్‌బీర్‌ని చూశారా..? ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు: బిగ్ బీ
ట్విట్టర్ ద్వారా తన అనుభవాలు, అభిప్రాయాలను పంచుకునే స్టార్స్‌లో బిగ్ బీ అమితాబ్ ముందు వరసలో ఉంటారు. ట్విట్టర్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న బిగ్ బీ అభిమానులతో ప్రతీ విషయాన్ని పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన 25ఏళ్ల క్రితం నాటి ఓ ఫోటో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలో అమితాబ్‌తో పాటు రిషి కపూర్, భార్య నీతూ కపూర్, పిల్లలు రణ్‌బీర్, రిధిమా కపూర్‌లు ఉన్నారు. బుజ్జి రణ్‌బీర్‌ను అమితాబ్ ముద్దుగా చేతితో తాకే ప్రయత్నంలో ఉండగా క్లిక్ మనిపించిన ఈ అరుదైన ఫోటోను బిగ్ బీ షేర్ చేశారు. అనంతరం 'లిటిల్ రణ్‌బీర్ ని చూశారా..? చాలా క్యూట్‌గా ఉన్నాడు కదూ.. ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు' అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.