: ఇంటర్నెట్ ఎందుకు కావాలి?... మనోళ్లు చెబుతున్న సమాధానమిదే!
అసలు ఇంటర్నెట్ ఎందుకు కావాలి? ప్రజలు ఇంటర్నెట్ వాడటానికి ఇంతగా అలవాటు పడిన కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో అమెరికన్ ఎక్స్ ప్రెస్, నీల్సన్ లు ఓ సర్వేను నిర్వహించాయి. "అండర్ స్టాండింగ్ ఆన్ లైన్ కస్టమర్స్" పేరిట ఈ సర్వేను నిర్వహించగా, అత్యధికులు చెప్పిన సమాధానాలు ఏంటో తెలుసా? ఒకటి ఆన్ లైన్ షాపింగ్ కోసం, ఆ తరువాత సామాజిక మాధ్యమాల కోసమట. తాము ఆన్ లైన్ షాపింగ్ కోసం నెట్ వాడుతున్నామని 98 శాతం మంది చెప్పగా, రెండవ ప్రిఫరెన్స్ గా 96 శాతం మంది సోషల్ నెట్ వర్కింగ్ కు, ఆపై 95 శాతం మంది బ్యాంకింగ్, ఈ-మెయిల్, టికెట్ బుకింగ్ కోసం వాడుతున్నట్టు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులకు నెట్ వాడుతుంటామని 51 శాతం, సేఫ్టీ, సెక్యూరిటీ కోసమని 43 శాతం, క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసమని 40 శాతం, డిస్కౌంట్లు అధికమని, తక్కువ ధరకు వస్తువులు కొనవచ్చని 38 శాతం మంది నెట్ వాడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.