: బెంగళూరులో బిజీబిజీగా రఘువీరా!... అనంత నీటి కష్టాలను కన్నడ సీఎం ముందు ఏకరువు పెట్టిన వైనం


ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేల విడిచి సాము చేస్తున్నారా? అంటే... తాజాగా ఆయన చేపట్టిన పర్యటనలను చూస్తే ఔనని చెప్పక తప్పదేమో. ఏపీలోని కరవు జిల్లా అనంతపురం జిల్లాకు చెందిన రఘువీరా... జిల్లా ఎదుర్కొంటున్న తాగు, సాగు నీటి సమస్యలపై పోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనంతపురం కేంద్రంగా సైకిల్ యాత్ర, నిరాహార దీక్షలు చేపట్టిన ఆయన తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ల్యాండయ్యారు. నిన్ననే బెంగళూరు చేరుకున్న రఘువీరా... అక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తుంగభద్ర వరద నీటిని కిందకు వదిలితే అనంత తాగు, సాగు నీటి కష్టాలు తీరతాయని ఆయన సిద్ధరామయ్యకు చెప్పారు. రఘువీరా వాదనతో ఏకీభవించిన సిద్ధరామయ్య... వరద నీటిని వదిలేందుకు సానుకూలంగా స్పందించారట. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన రఘువీరా... బెంగళూరు పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ స్థితిగతులపై ఆయన డిగ్గీరాజాకు వివరించారట.

  • Loading...

More Telugu News