: పుట్టినరోజు నాడు 'మహారాష్ట్ర' కేక్ ను కట్ చేసి వివాదం కొనితెచ్చుకున్న మాజీ అడ్వకేట్ జనరల్!


మహారాష్ట్రలో మరాట్వాడా ప్రాంతాన్ని మరో రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కు మద్దతిచ్చి ఇటీవల మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవిని త్యజించిన శ్రీహరి అనేయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన 66వ పుట్టిన రోజు వేడుకలు విదర్భలోని బందారాలో జరుగగా, మహారాష్ట్ర చిత్రపటాన్ని కేక్ పై క్రీమ్ తో పెయింట్ చేయగా, దానిలోని మరాట్వాడా, విదర్భ ప్రాంతాలను విడగొడుతూ కేకును కట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే స్పందిస్తూ, "అనేయ్ నీ పుట్టినరోజు వేడుకలను దీర్ఘకాలం పాటు గుర్తుంచుకుంటాం" అన్నారు. ఆయన ఇంతకన్నా ఇంకేం చేయలేడులే అని అసెంబ్లీలో విపక్ష నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే వ్యాఖ్యానించారు. ఆయన తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శల వాడి పెరుగుతోంది. కొంతకాలం క్రితం వరకూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు దగ్గరి అనుయాయుడిగా పేరు తెచ్చుకున్న అనేయ్, అటు మరాట్వాడ, ఇటు విదర్భ ప్రాంతాలను రెండు వేర్వేరు రాష్ట్రాలుగా విడగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News