: పదవులు నాకెందుకు?: కేసీఆర్ తో కలిసేదే లేదన్న కోమటిరెడ్డి
తనకు పదవులు, అధికారం ముఖ్యం కాదని, రైతులు, ప్రజల సంక్షేమమే ముఖ్యమని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత కొమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గత కొంత కాలంగా తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని, కేసీఆర్ తో కలిసేది లేదని స్పష్టం చేసిన ఆయన, తన వెన్నంటి నడిచే కార్యకర్తలదీ ఇదే అభిప్రాయమని అన్నారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల పథకాలను పూర్తి చేసేందుకు పోరాటం సాగించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వివరించారు.