: గగనతలంలో థాయ్ విమానం కుదిపేసింది.. ప్రయాణికుల గుండె ఝల్లుమంది!
గగనతలంలో ఉన్న ఓ థాయ్ విమానం భారీ కుదుపుకి లోనుకావడంతో ఒక్కసారిగా ప్రయాణికుల గుండె ఝల్లుమంది. దాదాపు 72 మంది ప్రయాణికులు, 12 మంది స్టాఫ్‌తో సింగపూర్ గగనతలంలో వెళ్తోన్న సమయంలో థాయ్ ఎయిర్‌వేస్ విమానం ఒక్కసారిగా భారీ కుదుపుకి లోనైంది. దీంతో ఐదుగురు స్టాఫ్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రయాణికుడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఘటనకు సంబంధించి ప్రయాణికులకు క్షమాపణ చెబుతున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.