: కరిష్మాకపూర్‌కి ఇది క్లిష్టమైన సమయం: కరీనాకపూర్ ఆవేదన
బాలీవుడ్ నటి కరిష్మాకపూర్, ఆమె భర్త వ్యాపారవేత్త సంజయ్‌కపూర్‌ల విడాకుల కేసు అనేక మలుపులు తిరిగి చివరకు విడాకులు మంజూరైన నేపథ్యంలో.. ఆమె సోదరి, బాలీవుడ్ తార కరీనాకపూర్ ఖాన్ స్పందించింది. ఈ విషయమై నిజం ఏంటో తెలియకుండా కరిష్మాకపూర్‌పై పలువురు చేస్తోన్న రూమర్స్ నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయమై తాను కూడా ఎక్కువగా మాట్లాడబోనని చెప్పింది. కరిష్మా కపూర్‌ది ప్రస్తుతం క్లిష్టమైన సమయం అని వ్యాఖ్యానించింది. కరిష్మా లైఫ్‌కి సంబంధించి అసలైన నిజం ఎవరికీ తెలియదని చెప్పింది. కరిష్మాకపూర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వ్యాపార ప్రకటనల్లోను, కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గాను యాక్టివ్‌గానే ఉంది. విడాకుల గొడవలతో కరిష్మాకపూర్ ఈ మధ్య వార్తల్లో పదే పదే కనిపించింది.