: ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో అక్క‌డ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు బంద్‌


భ‌ద్ర‌తా సిబ్బందిలో ఒక‌రు స్థానిక బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ.. శ్రీ‌న‌గ‌ర్‌లో కొందరు చేస్తోన్న ఆందోళ‌న ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీయడం, కాల్పుల్లో న‌లుగురు మ‌ర‌ణించ‌డంతో భద్రత కారణాల దృష్ట్యా అక్క‌డి ప‌లు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. పరిస్థితులు అదుపులోకి వ‌చ్చేంత‌వ‌ర‌కు ఈ స‌ర్వీసుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. హింద్వారాకు చెందిన ఓ బాలికను జ‌వాను లైంగికంగా వేధించాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో అక్క‌డ ఆందోళ‌న చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌న‌ను లైంగిక వేధింపులకు గురి చేశాయన్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ స‌ద‌రు బాలిక చెబుతుండగా తీసిన వీడియోను ఆర్మీ అధికారులు నిన్న విడుద‌ల చేశారు. అయినా ప‌రిస్థితులు అదుపులోకి రాలేదు. దీంతో ఉద్రిక్త‌త మ‌రింత చెల‌రేగ‌కుండా మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు.

  • Loading...

More Telugu News