: పుట్టింగల్ బావుల్లో రసాయనాలు, మానవ అవయవాలు... నీరంతా విషతుల్యమే!


బాణసంచా పేలి ఘోర దుర్ఘటన జరిగిన కొల్లం సమీపంలోని పుట్టింగల్ దేవి ఆలయ సమీపంలోని ప్రజలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని బావుల్లోకి రసాయనాలు చేరివుంటాయని, మానవ శరీర అవయవాలు పడివుండవచ్చని అధికారులు వెల్లడించారు. ఆలయం సమీపంలోని బావుల్లో నీటిని ప్రజలు వాడవద్దని హెచ్చరించారు. ఆరోగ్య శాఖ అధికారులు బావుల్లోని నీటిని పరీక్షించిన తరువాతే నీటిని వాడాలని తేల్చి చెప్పారు. చాలా మృతదేహాలకు కాళ్లు, చేతులు లేకపోవడం, అవి ప్రమాద స్థలంలో లభ్యం కాకపోవడంతో ఈ అనుమానం వచ్చినట్టు తెలిపారు. కాగా, 113 మంది ప్రాణాలను బలిగొన్న దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ సర్కారు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

  • Loading...

More Telugu News