: కుప్పకూలిన సన్బ్రిడ్ ఏవియేషన్ విమానం.. కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ప్రమాదం.. 12 మంది మృతి
ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఒక్సామిన్ నుంచి కియుంగాకు బయలుదేరిన సన్బ్రిడ్ ఏవియేషన్ విమానం కుప్పకూలి పైలెట్ సహా విమానంలోని 12మంది మృతి చెందారు. యుంగా ఎయిర్పోర్టులో కొన్ని నిమిషాల్లో ల్యాండ్ కాబోతున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రయాణికుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పపువా న్యూ గునియాలో ఈ ప్రమాదం జరిగింది. కుప్పకూలిన సన్బ్రిడ్ ఏవియేషన్ విమానం యుంగా ఎయిర్పోర్టు రన్ వే కి కేవలం ఒకే ఒక కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.