: చంద్రబాబు నెత్తిన మట్టి తట్ట!... చింతూరు ఉపాధి హామీ పనుల్లో ఏపీ సీఎం


జాతీయ ప్రాజెక్టు పోలవరం ముంపు మండలాల్లో నిన్న తొలి పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఉత్సాహంగా కనిపించారు. ముంపు మండలాల ప్రజలతో కలిసి ఆయన సరదాగా గడిపారు. ముంపు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఏమేం కావాలో చెప్పండి... వెనువెంటనే మంజూరు చేస్తామంటూ జనంలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పరిధిలోని చింతూరులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు... మట్టి తట్టను నెత్తిన పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప టోపీ పెట్టుకుని పక్కన నిలబడగా, కూలీలకు మరింత దగ్గరగా జరిగిన చంద్రబాబు మట్టితో నింపిన తట్టను నెత్తిన పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తలపై ఎలాంటి వస్త్రం లేకుండానే చంద్రబాబు సదరు తట్టను నెత్తికెత్తున్నారు.

  • Loading...

More Telugu News