: ఇక్బాల్ అబ్దుల్లా హేళన నుంచి పుట్టుకొచ్చిన చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్!


ఇక్బాల్ అబ్దుల్లా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో క్రికెటర్. అతనికి ఈ స్థాయి అంత సులువుగా ఏమీ రాలేదు. చాలా కష్టపడితేనే వచ్చింది. యూపీకి చెందిన ఇక్బాల్ కు క్రికెట్లో శిక్షణ ఇప్పించింది ఎవరో తెలుసా? ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో అందరినీ ఆకర్షించిన సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్. తన కున్న 225 చదరపు అడుగుల గదిలోనే ఇక్బాల్ ను ఉంచుకుని శిక్షణ ఇప్పించాడట. తీరా, ఇక్బాల్ కు క్రికెటర్ గా పేరొచ్చిన తరువాత, తన కొడుకు సర్ఫరాజ్ ఎదుగుదలకు సాయపడాలని కోరితే, ఇక్బాల్ అవహేళనగా మాట్లాడాడట. ఈ విషయాన్ని నౌషాద్ స్వయంగా వెల్లడించాడు. తనకు సామర్థ్యం ఉంది కాబట్టి ఎదిగానని, సర్ఫరాజ్ కు టాలెంట్ ఉంటే చూపించాలని సవాల్ విసురుతూ ఎద్దేవా చేశాడట. దాంతో వచ్చిన కసి, కోపం నుంచే మరింతగా కష్టపడ్డ నౌషాద్, ఓ దశలో వానలో తడుస్తూ, ట్రాక్ ప్యాంట్లు అమ్ముతూ, తన కొడుకుకు క్రికెట్ శిక్షణ ఇప్పించాడు. సర్ఫరాజ్ సైతం టీమిండియాలో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా కఠోర శ్రమతో పట్టు సాధించాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో సర్ఫరాజ్ మరింతగా రాణిస్తే, భారత జట్టులో స్థానం ఎదురుచూస్తుంటుందనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News