: ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై కోర్టు తీర్పులు సరికాదు: పరిపూర్ణానంద స్వామి
ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ ఇచ్చిన కోర్టు తీర్పులను పరిపూర్ణానంద స్వామి విమర్శించారు. మహిళలకు ఆలయ ప్రవేశంపై కోర్టు తీర్పు ఇచ్చేముందు హిందూ ధార్మికవేత్తలతో ఒక కమిటీ వేయాలని ఆయన సూచించారు. మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటే న్యాయ స్థానాలు స్పందిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. ‘భారత్ మాతాకీ జై’ అని అననంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా స్వామీజీ పరోక్షంగా ప్రస్తావించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజును సెలవు దినంగా చూడకుండా, సేవా దినంగా పాటించాలని పరిపూర్ణానంద స్వామీజీ సూచించారు.