: ఏం చేద్దాం...టీడీపీ భరోసా ఇచ్చింది!: కార్యకర్తలతో వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే సుజయకృష్ణ రంగారావు


వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ మారితే ఎలా ఉంటుందని అడిగారు. టీడీపీ నుంచి ఆహ్వానం అందిందని ఆయన కార్యకర్తలతో చెప్పారు. టీడీపీలో చేరితే రాజకీయ భవిష్యత్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని పార్టీ అధిష్ఠానం భరోసా ఇచ్చిందని ఆయన పార్టీ అనుచరులకు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారాలని వారు సూచించారని ఆయన అన్నారు. దీంతో ఆయనతో నడిచేందుకు పార్టీ కార్యకర్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక ఆయన పార్టీ మారడమే లాంఛనం!

  • Loading...

More Telugu News