: మయన్మార్ లో భూకంపం.. ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, విశాఖ తదితర నగరాల్లో స్వల్పంగా భూప్రకంపనలు
మయన్మార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 7గా నమోదైంది. కాగా, మనదేశంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, పాట్నా, గువాహటి, షిల్లాంగ్, ఐజ్వాల్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో.. విశాఖపట్టణంలో తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోను, శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, పలాస, నరసన్నపేట మండలంలోని గుర్లాం, చింతలవానిపేట, నడగాం, కుమ్మరిపేటలో స్వల్పంగా భూమి కంపించింది. కాగా, భారత్- మయన్మార్ సరిహద్దులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.