: ‘బాహుబలి’లో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపోయాను: అమీ జాక్సన్


బాహుబలి చిత్రంలో హీరో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపోయానని బ్రిటిష్ మోడల్, నటి అమీజాక్సన్ చెప్పింది. అంతేకాదు, తన మనస్సులో ఉన్న మరో మాట కూడా బయటపెట్టింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించాలని ఉందని, ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. కాగా, తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో అమీజాక్సన్ నటించింది. తాజాగా రోబో సీక్వెల్ ‘2.0’ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తోంది. హిందీలో ‘ఏక్ దివానా థా’, తెలుగులో ‘ఎవడు’, తమిళ్ లో ‘మద్రాసి పట్టణం’ ‘ఐ’ చిత్రాల్లో అమీజాక్సన్ నటించింది.

  • Loading...

More Telugu News