: జగన్ పైన, సాక్షి పత్రికపైన పరువు నష్టం దావా వేస్తాను: ఎంపీ సీఎం రమేష్


తనపైన, తన కంపెనీపైన సాక్షి పత్రిక తప్పుడు వార్తలు రాసిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. ఇటువంటి వార్తలు రాసిన సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్, సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారని రాశారని, ఆ విషయాన్ని నిరూపించాలని, ఆ విధంగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే సాక్షి పత్రికను మూసివేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తనపై వార్త రాసేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదని అన్నారు. అవినీతి డబ్బుతో పత్రిక పెట్టిన జగన్ కు, అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని సీఎం రమేష్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News