: ఎంపీలకు కచేరీ విందివ్వనున్న గాయకుడు ఉదిత్ నారాయణ్!


ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆయన పలువురు ఎంపీలకు విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రధానితో పాటు పలువురు ఎంపీలను ఆయన ఈ విందుకు ఆహ్వానించనున్నారు. వచ్చే నెల ఏర్పాటు చేయనున్న ఈ విందు సందర్భంగా ఆహూతులను తన పాటలతో ఉదిత్ నారాయణ్ అలరించనున్నారు. ఈ సందర్భంగా ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ కూడా తన గాత్రంతో ప్రముఖులను అలరించనున్నాడు.

  • Loading...

More Telugu News