: ఇకపై తెలంగాణ సిటీ బస్సుల్లో ఉచిత వైఫై


ప్రయాణికులను ఆకట్టుకునేందుకుగాను తెలంగాణ సిటీ బస్సుల్లో ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈడీ పురుషోత్తం మాట్లాడుతూ, ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు గాను ఈ వినూత్న పథకాన్ని చేపడుతున్నామన్నారు. ఏసీ, మెట్రో డీలక్స్ ప్రయాణికులకు తొలి 30 నిమిషాలు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జేఎన్ఎన్ యూ ఆర్ ఎం బస్సుల బాడీల మార్పు అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాదిలో 350 బస్సుల బాడీలను మార్చనున్నామన్నారు.

  • Loading...

More Telugu News