: కదలలేని ఆయన పలకరింపుకు ఐదు లక్షల లైకులు
ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పలకరింపుకు చైనీయులు విశేషంగా స్పందించారు. చైనా వర్షన్ ట్విట్టర్ లో ఆయన నేడు చేరారు. భారత్ లో ట్విట్టర్ లానే చైనాలో వైబో సేవలందిస్తుంది. ఇందులో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేరారు. ఆయన చేరిన క్షణాల్లో సుమారు పది లక్షల మంది ఆయనను అనుసరించడం మొదలు పెట్టారు. 'చైనాలోని నా స్నేహితులందరికీ శుభాకాంక్షలు. సామాజిక మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాను. నా జీవితం గురించి, నేను తెలుసుకున్న విషయాల గురించి దీని ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. దానితో పాటు మీరు నన్ను ప్రశ్నించడం ద్వారా మరిన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా'నని ఆయన చైనీయులను పలకరించారు. దీనిని ఐదు లక్షల మంది లైక్ చేశారు.