: గుర్గావ్...గురుగ్రామ్ అయింది...తెలంగాణ ఎప్పుడు టెలిగ్రాంగా మారుతుంది?: నెటిజన్ల కొంటె ప్రశ్నలు


ద్రోణాచార్యుడు తిరుగాడిన ప్రాంతమని చెబుతూ, గుర్గావ్ ను గురుగ్రామ్ గా మార్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గుర్గావ్ ను పేరు మారుస్తున్నామంటూ పాతపేరు పెట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గుర్గావ్ ఇప్పుడు గురుగ్రామ్ గా మారింది, మరి తెలంగాణ ఎప్పుడు టెలిగ్రాంగా మారుతుంది? డిగ్బోయ్ ని డయాగ్రామ్ గా, ఆనంద్ ను అనగ్రామ్ గా, మనోహర్ పూర్ ను మోనోగ్రామ్ గా ఎప్పుడు మారుస్తారని ఓ నెటిజన్ ఆసక్తికర వ్యఖ్యలు చేశారు. ఇకపై గురుగ్రామ్ ప్రజలను గురువంశీయులంటారా? లేక గురులోకులు అంటారా? అలా కాకుండా గ్రామర్స్ అంటారా? అదీ కాకుండా గురునాల్ ఇష్క్ మిథా ఒయ్ హోయ్ అని పిలుస్తారా? ఎలా పిలుస్తారు? అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఈ పేరు మార్పు వల్ల 500 ఫార్చ్యూన్ కంపెనీలకు నెలవైన గుర్గావ్ లో పరిస్థితులు ఏమైనా మెరుగవుతాయా? అని మరికొందరు ప్రశ్నించారు. కుట్రపూరితంగా ఏకలవ్యూడి చేతి బొటనవ్రేలు కోరిన ద్రోణాచార్యుడి పేరుతో అంబేద్కర్ జయంతి రోజున పేరు మార్పు ప్రకటించడం ఏంటని పలువురు ప్రశ్నించారు. ఇలా గురుగ్రామ్ పేరు మార్పుపై 24.6 వేలకు పైగా ట్వీట్లు వెలువడడం విశేషం.

  • Loading...

More Telugu News