: భారత్ లో టాప్-10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐఐటీ హైదరాబాద్


మన దేశంలోని ఉన్నత విద్యా కళాశాలకు ర్యాంకింగ్స్ ను మొట్టమొదటిసారిగా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. టీచింగ్, లెర్నింగ్, వనరులు, పరిశోధన, కన్సల్టింగ్, కోఆపరేషన్, గ్రాడ్యుయేట్ అవుట్ కమ్స్ వంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుని కళాశాలల ఎంపిక జరిగింది. ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, వర్శిటీలను ర్యాంకింగ్ కేటగిరిలో ఎంచుకుంది. సుమారు 3,500 విద్యా సంస్థలను ర్యాంకింగ్స్ పరంగా వడపోయగా టాప్ టెన్ లో 10 కాలేజీలు నిలిచాయి. మొదటి పది కళాశాలల్లో ఐఐటీ హైదరాబాద్ కు కూడా స్థానం దక్కింది. మొదటి పది కళాశాలల వివరాలు... 1. ఐఐటీ మద్రాసు 2. ఐఐటీ బొంబాయి 3. ఐఐటీ ఖరగ్ పూర్ 4. ఐఐటీ ఢిల్లీ 5. ఐఐటీ కాన్పూర్ 6. ఐఐటీ రూర్కీ 7. ఐఐటీ హైదరాబాద్ 8. ఐఐటీ గాంధీనగర్ 9. ఐఐటీ రోపార్ లేదా ఐఐటీ ఆర్పీఆర్ 10. ఐఐటీ పాట్నా

  • Loading...

More Telugu News