: బుడ్డోడు కాదు...బుల్డోజర్...విజయాన్ని దూరం చేసింది అతడే!: వార్నర్ ప్రశంసలు


ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుత ఇన్నింగ్స్ ఆడి కేవలం 10 బంతుల్లో 35 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ను సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆకాశానికెత్తాడు. తమ జట్టు ఓటమికి కారణం సర్ఫరాజ్ అని తెలిపాడు. చివరి రెండు ఓవర్లలో సర్ఫరాజ్ ఆడిన ఇన్నింగ్సే తమను విజయానికి దూరం చేసిందని వార్నర్ వెల్లడించాడు. ప్రత్యర్థి జట్టు చివరి రెండు ఓవర్లలో చెలరేగిందని, సర్ఫరాజ్ ఆట మ్యాచ్ ని తమకు దూరం చేసిందని వివరించాడు. కోహ్లీ, డివిలియర్స్ గొప్పగా ఆడినప్పటికీ, వారికన్నా సర్ఫరాజ్ ఆడిన ఇన్నింగ్స్, బెంగళూరు జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టిందని వార్నర్ తెలిపాడు. చెత్తబంతులు వేస్తున్న బౌలర్లతో తాను మాట్లాడకపోవడం, నెహ్రా గాయపడడం కూడా జట్టు ఓటమికి కారణమైందని వార్నర్ అభిప్రాయపడ్డాడు. కాగా, గేల్, డివిలియర్స్, కోహ్లీ, వాట్సన్ వంటి ఆటగాళ్లతో కూడిన రాయల్ ఛాలెంజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఒకదశలో చేరుకునేందుకు ప్రయత్నించిన సన్ రైజర్స్ 8వ ఓవర్ తరువాత చేతులెత్తేసి ఓటమి బాట పట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News