: కేసీఆర్ తీరుకు నిరసనగా రేపు ఒక్కరోజు దీక్ష చేపడతా: టీడీపీ నేత మోత్కుపల్లి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును నిరసిస్తూ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు రేపు ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ దీక్షను చేపట్టనున్నామన్నారు. కేసీఆర్ స్వయంగా అంటరానితనం పాటిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ క్యాబినెట్ లోకి దళితులను తీసుకోలేదని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెడితే సరిపోదని, దళితులకు సముచిత స్థానం కల్పించాలని మోత్కుపల్లి అన్నారు.

  • Loading...

More Telugu News