: కాశ్మీర్ కాల్పులు: ఉద్రిక్త వాతావరణం.. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
కళాశాల విద్యార్థినిని వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ శ్రీనగర్‌లో ఆందోళన చేస్తున్నవారిపై జరిగిన కాల్పుల్లో 55 ఏళ్ల మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో భద్రతాదళాల కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య మూడుకి చేరింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శ్రీనగర్, కప్‌వారాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ విషయమై సీఎం మహబూబా ముఫ్తీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో ఇప్పటికే సమావేశమై, చర్చించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉల్లంఘన జరిగిందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.